తట్టివారిపల్లిలో సైబర్ అవగాహన సదస్సు

తట్టివారిపల్లిలో సైబర్ అవగాహన సదస్సు

అన్నమయ్య: మదనపల్లి మండలం తట్టివారిపల్లిలో సోమవారం సీఐ కె. కళా వెంకటరమణ సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, లింకులు నమ్మవద్దని, పోలీసులనే చెప్పి బ్లాక్‌మెయిల్ చేస్తే డబ్బులు ఇవ్వకూడదని సూచించారు. అధికారులు, ఇతర శాఖల సూచనలను పాటించాలని చెప్పారు.