VIDEO: ​షార్ట్ సర్క్యూట్‌.. పాన్ షాపు దగ్దం

VIDEO: ​షార్ట్ సర్క్యూట్‌.. పాన్ షాపు దగ్దం

SRPT: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పాన్ షాపు దగ్ధమైన ఘటన సోమవారం సూర్యాపేటలోని విద్యానగర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టంతో పాటు, గల్లా పెట్టెలోని రూ. 30 వేల నగదు అగ్నికి ఆహుతైందని బాధితుడు శ్రీశైలం కన్నీటిపర్యంతమయ్యారు. సర్వస్వం కోల్పోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు.