'ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య పెంచాలి'

KNR: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నవంబర్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన ప్రసవాలపై సమీక్షించారు. గంగాధర పిహెచ్సిలో 28 ప్రసవాలు జరగడం పట్ల అభినందించారు.