VIDEO: తూప్రాన్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు
MDK: తూప్రాన్ పట్టణంలో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే కొత్త బట్టలు ధరించి పెద్ద చెరువు కట్ట వద్ద గల ఈద్గా వద్దకు వెళ్లారు. ఈద్గాలో అందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తూప్రాన్ ఎస్సై గంగరాజు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.