'వెంటనే వెలుగోడు ఎంఈవోను సస్పెండ్ చేయాలి'

NDL: గడివేముల మండలంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చదువుకున్న డీఎస్సీ అభ్యర్థి కమలమ్మకు స్టడీ సర్టిఫికేట్ కోసం వెలుగోడు ఎంఈవో రూ.2,000 డిమాండ్ చేసినట్టు బహుజన విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు పెద్ద స్వామి గురువారం ఆరోపించారు. అమ్మాయిపై ఆర్థిక భారం మోపిన ఎంఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని, విద్యాశాఖ అవినీతి నిర్మూలనలో కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.