నేడు ఎంపి కలిశెట్టి షెడ్యూల్

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం చిలకపాలెం జంక్షన్ హైవే పక్కన గల కోట శక్తి ఫంక్షన్ హాల్‌లో 10 నుండి 1 వరకు నియోజకవర్గ పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుండి అక్కడే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారని ఎంపీ కార్యాలయ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి.