'మాధవ్ పర్యటన విజయవంతం చేయండి'

'మాధవ్ పర్యటన విజయవంతం చేయండి'

కోనసీమ: జిల్లా అయినవిల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు పాల్గొని మాట్లాడుతూ.. ఈ నెల 25 న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అమలాపురం పర్యటనకు వస్తున్నారని, అధిక సంఖ్యలో నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.