'సీపీఎం అభ్యర్థులను గెలిపించండి'
BDK: స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని చర్ల సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రజలకు పిలుపునిచ్చారు. కుర్నపల్లి, బోదనెల్లి గ్రామ పంచాయతీలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎం పార్టీ పోరాటాల వల్ల మండలంలో రోడ్లు, పోడు భూముల పట్టాలను సాధించామన్నారు.