ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కుప్పకూలిన పైకప్పు

కామారెడ్డి: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం రక్తనమూనాలు సేకరించే ప్రాంతంలో వర్షం దాటికి పైకప్పు కుప్పకూలింది. జన సంచారం ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అటుగా వెళ్లే ఇద్దరు వ్యక్తులకు అతి స్వల్పంగా గాయాలయ్యాయి. సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరారు.