"విద్య" లఘుచిత్రం ప్రారంభించిన కమిషనర్
BPT: బాపట్ల వి.ఆర్.క్రియేషన్స్ నిర్మిస్తున్న "విద్య" లఘుచిత్రాన్ని మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి క్లాప్ కొట్టి మంగళవారం ప్రారంభించారు. అక్షరజ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుందని, సమాజ మార్పునకు ఇలాంటి చిత్రాలు అవసరమని ఆయన అన్నారు. సందేశాత్మక చిత్రాలు తీస్తున్న దర్శకుడు కె.చంద్రశేఖర్‌ను అభినందించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణ పాల్గొన్నారు.