VIDEO: ఘనంగా శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు

CTR: పుంగనూరులో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఆదివారం బలిజ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. మొదట న్యూ బైపాస్ భీమగానిపల్లి కూడలిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని ఇందిరా కూడలిలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నానబాల గణేష్, ముత్యాలు, మధుసూదన్ రాయల్ పాల్గొన్నారు.