చెలరేగుతున్న రింకూ.. ఛాన్స్ ఇస్తారా?
టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ రంజీ ట్రోఫీలో చెలరేగి ఆడుతున్నాడు. నిన్న తమిళనాడుతో ముగిసిన మ్యాచులో UP తరఫున 176 రన్స్ చేశాడు. అంతకుముందు 3 మ్యాచుల్లోనూ 322 (89 vs HAR, 68 vs PUN, 165* vs AP) పరుగులతో తన మార్క్ చూపించాడు. అటు భారత టెస్ట్ టీమ్ మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది. దీంతో టెస్టుల్లో రింకూకి ఛాన్స్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.