20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: చంద్రబాబు
AP: చెప్పినట్టుగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 'ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమలు రావాలి.. జాబ్ మేళాలు పెడతాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకొస్తున్నారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం రాష్ట్రానికి వెన్నుముకలా మారబోతుంది. త్వరలోనే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌ను చేపడతాం' అని వెల్లడించారు.