వెల్ఫేర్ వీక్ మైనారిటీ సంక్షేమ అవగాహన కార్యక్రమం
PDPL: వెల్ఫేర్ వీక్ (ఏప్రిల్ 20–26)లో భాగంగా జిల్లా కలెక్టరేట్లో మైనారిటీ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా అధికారి రమేశ్ కుమార్ నాయుడు తెలిపారు. వారం పొడవున మహిళలకు కుట్టు యంత్రాలు, యువతకు నైపుణ్య శిక్షణ, కెరీర్ మార్గదర్శనం, విద్యార్థులకు పేరెంట్-టీచర్ సమావేశాలు, అర్హులకు ఆర్థిక సహాయం, ర్యాలీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.