చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ
SDPT: బెజ్జంకి మండలంలోని చీలాపూర్ పల్లె గ్రామ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ చేపట్టారు. సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాలామృతం, కోడిగుడ్లు అందజేశారు. చిన్నారుల ఆరోగ్యానికి సమతుల ఆహారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్ పూర్మ సుజాత పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించగా, తల్లిదండ్రులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.