ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించిన కలెక్టర్
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో జనాభా లెక్కల సేకరణపై మాస్టర్ ట్రైనర్లు కలెక్టర్ బాలాజీ సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి జనాభా లెక్కల సేకరణ అత్యంత కీలకమైన కార్యక్రమమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో గణన చేసే సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులను, ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.