పాక్‌లో విద్యాసంస్థలు, ఎయిర్‌పోర్టులు బంద్

భారత్ మెరుపుదాడులతో పాక్‌లో అలజడి నెలకొంది. ఈ క్రమంలో లాహోర్, సియాల్‌కోట్ ఎయిర్‌పోర్టులను అధికారులు మూసివేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. విద్యాసంస్థలు మూసివేశారు. మరోవైపు ఉత్తర భారతదేశంలోని శ్రీనగర్, లేహ్, ధర్మశాల, జమ్ము, అమృత్‌సర్‌లోని ఎయిర్‌పోర్ట్‌లను మూసివేశారు.