'నా బిడ్డను కాస్త చూసుకో'.. మానవత్వం చాటిన పోలీస్

'నా బిడ్డను కాస్త చూసుకో'.. మానవత్వం చాటిన పోలీస్

WGL: ఉర్సుగుట్ట ప్రాంతంలోని అమ్మవారిపేట సమ్మక్క జాతరలో హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ మానవత్వాన్ని చాటారు. దర్శనానికి వెళ్లే సమయంలో ఓ తల్లి తన బిడ్డను జయరాజ్‌కి అప్పగిస్తూ  “అన్నా, నా బిడ్డను కాస్త చూసుకో” అని కోరింది. జయరాజ్ తల్లి తిరిగి వచ్చే వరకు బిడ్డను లాలిస్తూ సురక్షితంగా సంరక్షించారు. దర్శనం అనంతరం తల్లికి బిడ్డను అప్పగించడంతో జయరాజ్‌ను అభినందించారు.