కలెక్టర్‌ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాదిగలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సల్మాన్, శ్రీనివాసులు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.