వరద ఉధృతిని పరిశీలించిన అదనపు DCP

KMM: ఎగువ ప్రాంతంలో అధిక వర్షాల మూలంగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో శనివారం ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట మున్నేరు, పాలేరు రిజర్వయర్ వరద ఉధృతిని అదనపు DCP ప్రసాద్ రావు పరిశీలించారు. పోలీస్ అధికారులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీట మునిగిన రోడ్లు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేటాకు వెళ్లవద్దని సూచించారు.