పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు
CTR: సోమల పంచాయతీ నిలుకూరివారిపల్లి వద్ద శనివారం వేకువ జామున మూడు ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేశాయి. అడవిలో నుంచి పంట పొలాల్లోకి వచ్చిన మూడు ఏనుగులు వరి, టమాటా పంటలు ధ్వంసం చేశాయి. డ్రిప్ పైపులు, గేటు వాళ్లను విరిచే సాయి. అనంతరం తిరిగి అడవుల్లోకి చేరుకుంటున్నాయి. పగలంతా అడవుల్లో తిష్ట వేస్తూ రాత్రి వేళలో పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు బాధపడుతున్నారు.