హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

SRD: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్ర ర్యాలీలు శనివారం ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం తెలిపారు. శోభాయాత్రలకు పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్య మాల్లో వచ్చే అసత్య ప్రచారాలు, రూమర్లు నమ్మవద్దని సూచించారు. రూమర్లను ఎవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.