క్రీడాకారులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి: ఎంపీపీ

క్రీడాకారులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి: ఎంపీపీ

నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్యుఐ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ ఎంపీపీ పస్కా నర్సయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు అంటేనే ఓటమి, గెలుపు అని క్రీడల ద్వారా పోటీతత్వం అలవర్చుకోవాలని క్రీడాకారులకు సూచించారు. యువత విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.