ఆర్కే బీచ్‌లో తృప్తి క్యాంటీన్ ప్రారంభం
విశాఖ: ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా తృప్తి క్యాంటీన్‌ను ఇవాళ ప్రారంభించారు. పర్యాటకులకు, ప్రజలకు తక్కువ ధరలో టీ, కాఫీ, టిఫిన్స్, వెజ్, నాన్ వెజ్ బిర్యానీ అందించేందుకు మెప్మా ఆధ్వర్యంలో మహిళలతో ఈ పథకం అమలవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వంశీ కృష్ణ, వెలగపూడి రామకృష్ణ బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇది పర్యాటకులకు ఎంతో ఉపయోగపడనుంది.