నేడు కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. సముద్ర జలాల కారణంగా లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే, కేశనపల్లిలో కొబ్బరిచెట్లను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. ఆ తర్వాత శివకోటి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. అనంతరం శివకోటిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.