దొరికిన విలువైన ఆభరణాలు పోలీసులకు అప్పగింత

దొరికిన విలువైన ఆభరణాలు పోలీసులకు అప్పగింత

GDWL: జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ బంగ్లా ముందు శనివారం 7.5 గ్రాముల బంగారు ఆభరణాలు(కమ్మలు, మారటీలు), 20 తులాల కాళ్ల పట్టీలు, 5 తులాల చిన్న కడియాలు, ఒక పర్సు పడిపోయి ఉన్నాయి. అవి అటువైపుగా వెళ్తున్న వ్యక్తికి దొరికాయి. వాటిని టౌన్ ఎస్సై కళ్యాణ్ రామ్‌కు అప్పగించినట్లు తెలిపారు. వాటి విలువ సుమారుగా రూ. 2 లక్షలు ఉంటుందని, పోగొట్టుకున్నవారు ఎస్సైను సంప్రదించాలని కోరారు.