భారత్ అభివృద్ధిలో నారీశక్తి పాత్ర పెరిగింది: మోదీ

భారత్ అభివృద్ధిలో నారీశక్తి పాత్ర పెరిగింది: మోదీ

ప్రతి రంగంలోనూ మహిళలు తమ మార్కు చూపిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచం మందగమనం గురించి మాట్లాడుతున్న ప్రస్తుత తరుణంలో భారత్ వృద్ధి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధిలో నారీశక్తి పాత్ర పెరిగిందని తెలిపారు. దాని ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. వలసపాలన మూలాలను పూర్తిగా వదిలించుకుని దేశాభివృద్ధిలో భాగం కావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.