ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం

KDP: సిద్ధపటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. లక్షల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శేఖరాజుపల్లి రెవెన్యూ సర్వే సంఖ్య 421/1, 424లో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. సుమారు 50 సెంట్లను ఇటీవల స్థానికుడు యంత్రంతో చదును చేసి ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు.