గిరిజనులకు ఇప్పపువ్వుతో ఆదాయం
ASF: జిల్లాలోని గిరిజనులకు వేసవికాలంలో ఇప్పపువ్వు సేకరణతో ఆర్థికంగా చేయూత కలుగుతుంది. అన్ని మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో ప్రజలు వీటిని సేకరించి ఇప్పపువ్వు లడ్డు తయారు చేసి స్వయం సహాయక సంఘాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో గిరిజనుల నుంచి ఇప్పపువ్వు లడ్డు కొనుగోలుతో పాటూ ఇప్పపువ్వు సారాకు కూడా అదే తరహాలో డిమాండ్ పెరిగింది.