VIDEO: కొనుగోలు కేంద్రంలో నిలిచిపోయిన కందులు
ప్రకాశం: మర్రిపూడి మండలం చిమటలో ప్రభుత్వం పీఎసీఎస్ ద్వారా కందులు కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రం వద్ద కాటాలు వేసే పరిస్థితి లేక తాత్కాలికంగా కేంద్రం ఆపినట్లు పీఎసీఎస్ CEO అశోక్ శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతం బురదమయం కావడంతో కాటాలు వేసే వీలులేదని, వాతావరణం అనుకూలించాక తిరిగి ప్రారంభిస్తామని చెప్పరు.