'యూరియా కొరత లేదు'

W.G: ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ చిట్టిబాబు అధ్యక్షతన యూరియా పై అవగాహన సదస్సుల కార్యక్రమాన్ని రైతులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ADA కే.ప్రతాప్ జీవన్ రైతులతో మాట్లాడుతూ.. ఆకివీడు మండలం యూరియాకు కొరత లేదని మన దగ్గర అదనంగా 20 టన్నుల వరకు నిల్వ ఉందని రైతులకు తెలిపారు. రైతులు కంగారు పడవలసిన అవసరం లేదన్నారు.