'గణేష్ ఉత్సవ నిర్వాహకులు అనుమతి పొందాలి'

'గణేష్ ఉత్సవ నిర్వాహకులు అనుమతి పొందాలి'

NLG: ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెబ్ సైట్ https://policeportal.tspolice.gov.in/index.htm లో గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భద్రత కోసమే ఆన్ లైన్ లో గణేష్ ఉత్సవ నిర్వాహకులు అనుమతి పొందాలని కోరారు.