టీడీపీలో చేరిన ఎంపీటీసీ

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ అశోక్ రెడ్డి సమక్షంలో కొమరోలు మండలం నల్లగుంట్ల ఎంపీటీసీ సభ్యుడు సిహెచ్. వెంకటేశ్వర రెడ్డి బుధవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గిద్దలూరు లోని పార్టీ కార్యాలయంలో అశోక్ రెడ్డి ఎంపీటీసీతో సహా 50 మంది వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.