ఏనుగుల దాడిలో మరో రైతు మృతి

TPT: చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీలో శుక్రవారం రాత్రి ఏనుగులు భీభత్సం సృష్టించాయి. కొత్తపల్లి సమీపంలో ఓ రైతు సిద్దయ్యను తొక్కి చంపాయి. మృతుడు దాసరగూడెంకు చెందిన సిద్దయ్య(65)గా పోలీసులు గుర్తించారు. జనవరి 19వ తేది నారావారిపల్లె ఉప సర్పంచ్ రాకేశ్‌ని సైతం ఏనుగులు బలిగొన్న విషయం తెలిసిందే. వరుస ఘటనలతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు.