ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండాలి: సీఐ
కోనసీమ: ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండటమే పోలీసుల ఆకాంక్ష అని రాజోలు సీఐ నరేష్ కుమార్ పేర్కొన్నారు. రాజోలు మండలం కేసనపల్లిలో శనివారం రాత్రి పోలీసులు 'పల్లెనిద్ర' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, జాతరలు, ఇతర కార్యక్రమాలలో కమిటీలు ఏర్పాటు చేసుకుని సామరస్యంగా మెలగాలని సూచించారు.