VIDEO: మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం శేరిదగ్గుమిల్లిలో నూతనంగా నిర్మించిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి దాతలు అందిస్తున్న సహకారం ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.