ఈవీఎం గోదాంను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
SDPT: కలెక్టరేట్ కార్యాలయం పక్కనగల ఎలక్షన్ ఈవీఎం గోదాంను శనివారం జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెలవారీ పరిశీలనలో భాగంగా గోదాం వద్ద రక్షణ చర్యలను, లాగ్ బుక్, విజిటర్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సీసీ కెమెరాలు, 24/7 పోలీసు బందోబస్తు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి అని సూచించారు.