హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు
HYD: హైదరాబాద్ బుద్ధభవన్‌లో నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అదనపు కమిషనర్ అశోక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించామన్నారు.