సోలార్ ద్వారా విద్యుత్ అదా: మంత్రి
కోనసీమ: సోలార్ విద్యుత్‌ను వినియోగించడం ద్వారా కరెంట్ బిల్లుతో పాటు డబ్బు ఆదా చేసుకోవచ్చు అని మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. రామచంద్రపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి సోలార్ యూనిట్‌ను మంత్రి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీలకు ఈ పథకం పూర్తిగా ఉచితం కాగా ఇతరులకు కూడా ప్రభుత్వ సబ్సిడీ అందుబాటులో ఉందన్నారు.