'ధురంధర్ 2' క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్..!

'ధురంధర్ 2' క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్..!

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన 'ధురంధర్ 2' మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ సినిమా ముగింపులో భారీ క్లైమాక్స్ ట్విస్ట్‌ను దర్శకుడు ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. కేవలం ట్విస్ట్‌తోనే సరిపెట్టకుండా.. సినిమా చివరిలో 'ధురంధర్ 3'ని ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.