ఓటేసిన తర్వాతే టీ, టిఫిన్‌లు: సీఎం

ఓటేసిన తర్వాతే టీ, టిఫిన్‌లు: సీఎం

బీహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లకు సీఎం నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. మొదట ఓటు వేయండి.. తర్వాత టీ, టిఫిన్‌లు చేయాలని ట్వీట్ చేశారు. 'ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాకుండా బాధ్యత కూడా. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి.. ఇతరులను కూడా ఓటేసేలా ప్రేరేపించాలి' అని పేర్కొన్నారు.