VIDEO: ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు

VIDEO: ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు

అన్నమయ్య: రాజంపేట పట్టణంలో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలకు వందల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం నుంచే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల బయట విద్యార్థుల బంధువులు, మిత్రులు పుస్తకాలతో హడావిడి చేస్తూ కనిపించారు. అధికారులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.