'OG' నుంచి మెలోడీ సాంగ్ వచ్చేస్తోంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సినిమా 'OG'. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ పాట రిలీజ్ కాగా.. తాజాగా మరో పాట వచ్చేందుకు సిద్ధమవుతోంది. పవన్, ప్రియాంకలపై వచ్చే మెలోడీ సాంగ్ వినాయక చవితి కానుకగా ఈ నెల 27న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది.