BSNL టవర్లపై MP పుట్టా మహేష్ వినతి
ఏలూరు పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న BSNL మొబైల్ టవర్లను ఏర్పాటుచేయాలని MP పుట్టా మహేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు కోరారు. శుక్రవారం పార్లమెంట్లో మంత్రిని కలిసిన ఎంపీ.. గ్రామీణ ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ సౌకర్యం లేకపోవడంతో ఈ-గవర్నెన్స్, బ్యాంకింగ్ సేవలు, ఇతర ప్రజా సేవలందించే కార్యక్రమాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వివరించారు.