చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
MDK: జిల్లాలో విషాద ఘటన జరిగింది. వెల్దుర్తి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన గోపాల్ (40) మంగళవారం గ్రామంలోని పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి, చివరకు మృతదేహాన్ని వెలికి తీశారు.