కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామ అభివృద్ధి: ఎమ్మెల్యే
MHBD: తొర్రూరు మండలం సోమారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పారిజాతం తరపున ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి పారిజాతంని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు.