RRR భూ నిర్వాసితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

BHNG: రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు అండగా ఉంటామని CPI రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణంలోని లక్కారం SMR ఫంక్షన్ హాల్‌లో బాధిత రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. RRR ఏర్పాటు కోసం ప్రభుత్వం రైతులను ఒప్పించకుండా భూములను బలవంతంగా లాక్కుంటే ఊరుకునేది లేదన్నారు.