తొలి టెస్టు గెలుపుపై స్పందించిన బవుమా
టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో సాధించిన విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా స్పందించాడు. భారత్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. తమ విజయానికి కార్బిన్ బోష్‌తో తాను నెలకొల్పిన భాగస్వామ్యమే కారణమని చెప్పాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు. ఇదే జోష్‌తో చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.