మోదీకి నేపాల్ కొత్త ప్రధాని ధన్యవాదాలు

మోదీకి నేపాల్ కొత్త ప్రధాని ధన్యవాదాలు

నేపాల్ నూతన ప్రధాని బలేంద్ర షా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో బలేంద్ర షా ధన్యవాదాలు చెప్పారు. 'మీ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మన ప్రజల ఉమ్మడి శ్రేయస్సు కోసం ఇరు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను' అని నేపాల్ ప్రధాని కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.