VIDEO: రామలింగేశ్వరుడి సేవలో Dy.CM భట్టి విక్రమార్క
KMM: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వైరా మండలం స్థానాల లక్ష్మీపురం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో పోటెత్తింది. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన సతీమణి నందినితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న భట్టి దంపతులకు అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.